![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -456 లో... కార్తీక్ మొక్కలకి నీళ్లు పడుతుంటే పారిజాతం వచ్చి.. ఇక నుండి ఈ పారిజాతం అంటే ఏంటో అందరికి తెలిసేలా చేస్తాను అంటుంది. అప్పుడే పారిజాతానికి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. మీ నాన్నే చేసాడని పక్కకి వెళ్లి మాట్లాడుతుంది. సుమిత్ర చెల్లి చేసిన పనికి నా మైండ్ బ్లాంక్ అయిందని శ్రీధర్ అంటాడు. ఇప్పుడు ఇంట్లో దశరథ్, సుమిత్ర మాట్లాడుకోవడం లేదని పారిజాతం అంటుంది. ఆ దీప అందరిని విడగొడుతుందని శ్రీధర్ అంటాడు. మీరు జాగ్రత్త అత్తయ్య.. మీ కాపురం కూడా చెడగొట్టగలదని పారిజాతంతో శ్రీధర్ అంటాడు. అంత సీన్ లేదు అల్లుడు.. నేను గట్టిగా ఊపిరి బిగబెట్టానంటే అని పారిజాతం గట్టిగా ఊపిరిబిగబెట్టి కిందపడిపోతుంది.
ఆ వెంటనే డాక్టర్ ని పిలుస్తారు. డాక్టర్ పారిజాతాన్ని టెస్ట్ చేసి ఈవిడకి షుగర్, బిపి, కొలెస్ట్రాల్.. గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తాడు. లేని రోగం లేనట్టు ఉంది కదా అని కార్తీక్ అంటాడు. అసలు మీరు రోజు ఏం తింటారని పారిజాతాన్ని అడుగుతాడు. దాంతో పారిజాతం తన తిండి లిస్ట్ గురించి చెప్తుంటే.. అందరు షాక్ అవుతారు. మీరు తిండి ఇక ఆపాలి.. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి అని డాక్టర్ చెప్తాడు. నాకు చెప్పండి డాక్టర్ నేను దగ్గర ఉండి అన్ని చేస్తానని కార్తీక్ అంటాడు. వాడికి వద్దు అని పారిజాతం అంటుంది. తనకి వాడే కరెక్ట్ అని శివన్నారాయణ అంటాడు. కార్తీక్ ని బయటకు తీసుకొని వెళ్లి అన్ని చెప్తాడు.
ఆ తర్వాత దీప కిచెన్ లోకి వెళ్ళి వంట చేస్తుంది. కార్తీక్ పై దీప కోపంగా ఉంటుంది. అసలు మీరు ఇంటికి వచ్చాక ఏం జరిగిందని అడిగారా.. ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా.. అమ్మ, నాన్న ఇద్దరు గొడవపడ్డారు. నా చెల్లికి సారీ చెప్పే వరకు నిన్ను క్షమించనని నాన్న అన్నాడని దీప అనగానే వాళ్ళని నేను కలుపుతానని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. పెళ్లి అయిపోయి.. నిన్ను పంపించేవరకే మా అమ్మనాన్న.. మీ అమ్మనాన్న వాళ్ళని అలా పిలవాలంటే ఒక అర్హత ఉండాలి. ఇంకొకసారి అలా పిలవకని దీపతో జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత బావ నీతో మాట్లాడాలని కార్తీక్ ని జ్యోత్స్న బయటకు తీసుకొని వెళ్తుంది. నువ్వెందుకు అత్తమామయ్యలని విడగొడుతున్నావ్. అత్తకి అలాంటి ఆలోచన రాదు.. నువ్వే ఏదైనా చేసి ఉంటావని కార్తీక్ అడుగుతాడు. నేను ఎందుకు చేస్తానని జ్యోత్స్న అంటుంది. దీపపై నీకు ఎందుకు కోపం ఉంది. నన్ను పెళ్లి చేసుకుందనా అని కార్తీక్ అడుగుతాడు. దీప నన్ను చంపాలని అనుకుంది. అలాగే మా డాడ్ ని చంపాలని అనుకుందని జ్యోత్స్న అంటుంది. నువ్వు అత్తమామయ్యలని విడగొట్టాలని చూస్తున్నావ్.. వాళ్ళని నేను కలుపుతాను.. రోజు నీకు నరకం చూపిస్తాను.. దీప కాళ్ళపై పడి ఇక వద్దు బాబోయ్ అనేలా చేస్తానని జ్యోత్స్నతో, కార్తీక్ ఛాలెంజ్ చేస్తాడు. వెయిటింగ్ అని జ్యోత్స్న పొగరుగా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |